Yemmiganur: బస్టాండ్‌లో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి మెరుపు తనిఖీ!

Yemmiganur: ఎమ్మిగనూరు బస్టాండ్ ఆధునికీకరణ, పట్టణ ట్రాఫిక్ నియంత్రణపై అధికారులతో ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష. బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీలు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 10 July 2026 3:45 PM IST
Yemmiganur
X

Yemmiganur: బస్టాండ్‌లో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి మెరుపు తనిఖీ!

Yemmiganur: ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఏపీఎస్‌ఆర్‌టీసీ ప్రాంతీయ మేనేజర్ (RM), ఎమ్మిగనూరు డిపో మేనేజర్, మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి, టౌన్ మరియు రూరల్ సీఐలతో ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మిగనూరు బస్టాండ్ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, కొత్త బస్సుల ఏర్పాటు, రూటింగ్ వ్యవస్థ బలోపేతం, పట్టణ ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల నిర్వహణ మరియు రోడ్డు భద్రత వంటి అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ప్రజలకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన మరియు సకాలంలో రవాణా సేవలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే . ఆదేశించారు.

అనంతరం ఎమ్మెల్యే గారు ఎమ్మిగనూరు ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. బస్టాండ్ పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, ఆటో పార్కింగ్, క్యాంటీన్ నిర్వహణ, ప్రయాణికుల నిరీక్షణ ప్రాంతాలు మరియు ఇతర మౌలిక సదుపాయాలను తనిఖీ చేసి, లోపాలను వెంటనే సరిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఎమ్మిగనూరు బస్టాండ్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి, ప్రజలకు మరింత పరిశుభ్రమైన, సురక్షితమైన, ట్రాఫిక్ ఇబ్బందులు లేని, సౌకర్యవంతమైన రవాణా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అన్ని వసతులు కల్పించి, ఎమ్మిగనూరు బస్టాండ్‌ను ఆదర్శవంతమైన ప్రజా రవాణా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్‌టీసీ ప్రాంతీయ మేనేజర్, ఎమ్మిగనూరు డిపో మేనేజర్, మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి, టౌన్ మరియు రూరల్ సీఐలు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story