Yemmiganur: ఎమ్మిగనూరు 15వ వార్డులో జయనాగేశ్వర రెడ్డి ప్రచారం
Yemmiganur: ఎమ్మిగనూరు 15వ వార్డు టీడీపీ అభ్యర్థి మహబూబ్ బాషా, చైర్మన్ అభ్యర్థి మాచాని సునీతకు మద్దతుగా ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు.
Yemmiganur: ఎమ్మిగనూరు 15వ వార్డులో జయనాగేశ్వర రెడ్డి ప్రచారం
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు 15వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి మహబూబ్ బాషా కు మద్దతుగా ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 15వ వార్డులో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలను కలుసుకుని టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి మహబూబ్ బాషాను, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మాచాని సునీతను గెలిపించాలని కోరారు.
మహబూబ్ బాషా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వార్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ఎమ్మిగనూరు పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైప్లైన్ ద్వారా రోజుకు మూడు పూటలా నీరు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.




