Markapuram: ఆర్టీసీ బస్టాండ్‌లో కెమెరాల నిఘా.. ప్రారంభించిన ఎమ్మెల్యే!

Markapuram: ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగతనాల నివారణకు పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, డీఎస్పీ నాగరాజు ప్రారంభించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 July 2026 3:33 PM IST
Markapuram
X

Markapuram: ఆర్టీసీ బస్టాండ్‌లో కెమెరాల నిఘా.. ప్రారంభించిన ఎమ్మెల్యే!

మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఇటీవల దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు.

జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, డీఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో పట్టణ సీఐ అల్తాఫ్ హుస్సేన్, ఎస్సై విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాలతో ఏర్పాటు చేశారు .

సీసీ కెమెరాల వ్యవస్థను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, డీఎస్పీ నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ప్రయాణించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇటీవల చోటుచేసుకున్న దొంగతనాల నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా బస్టాండ్‌లోని ప్రతి కదలికపై నిరంతర నిఘా ఉంటుందని, నేరాలకు పాల్పడే వారిని వేగంగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐ అల్తాఫ్ హుస్సేన్, పట్టణ ఎస్ఐ విశ్వనాథరెడ్డి ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story