Pattikonda: కృష్ణగిరి మోడల్ స్కూల్‌లో ఘనంగా 'మెగా పేరెంట్స్ 4.0'

Pattikonda: కృష్ణగిరి మోడల్ స్కూల్‌లో నిర్వహించిన మెగా పేరెంట్స్ 4.0 కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ. శ్యాం కుమార్ పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda
Published on: 24 July 2026 4:38 PM IST
Pattikonda
X

Pattikonda: కృష్ణగిరి మోడల్ స్కూల్‌లో ఘనంగా 'మెగా పేరెంట్స్ 4.0'

Pattikonda: కృష్ణగిరి మండలంలోని కృష్ణగిరి మోడల్ స్కూల్‌లో ఈరోజు నిర్వహించిన మెగా పేరెంట్స్ 4.0 కార్యక్రమంలో పత్తికొండ శాసనసభ్యులు శ్రీ కె.ఈ. శ్యాం కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వెనుకబడిన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే శాశ్వత మార్గమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబం తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలని, ముఖ్యంగా ఆడపిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఒక ఆడపిల్ల చదువుకుంటే ఒక కుటుంబమే కాదు, సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు .

పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక పరిస్థితులు ఏ విద్యార్థి చదువుకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో ఒక కుటుంబంలో ఒక విద్యార్థికే పరిమితమైన తల్లికి వందనం ప్రయోజనాలను, కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక కుటుంబంలో అర్హులైన ప్రతి విద్యార్థికి అందేలా అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి ఇంట్లోని ప్రతి బిడ్డ చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ వహించాలని సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే పాఠశాలలోని విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులను పరిశీలించి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story