Alur: టీడీపీ గుండాల వేధింపులు.. అంగన్‌వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం!
Alur: పెద్దహోతురు గ్రామంలో టీడీపీ నేతల వేధింపులు భరించలేక అంగన్‌వాడీ టీచర్ లేపాక్షి విష గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స
Alur: టీడీపీ గుండాల వేధింపులు.. అంగన్‌వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం!
ఆలూర్: కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతురు గ్రామంలో టిడిపి గుండాల వేధింపులకు తాళలేక అంగన్వాడి టీచర్ గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న అంగన్వాడి టీచర్ లేపాక్షి ను పరామర్శించిన ఎమ్మెల్యే విరుపాక్షి.
రాష్ట్రంలో ప్రతి గ్రామంలో టిడిపి గుండాలు రోజురోజుకు ప్రభుత్వ ఉద్యోగస్తుల, మాహిళ ఉద్యోగస్తులు పై దాడులకు తెగబడుతున్నారు. ఆలూరు నియోజకవర్గం లో టిడిపి ఇన్చార్జి ప్రధాన అనుచరులే మహిళా ఉద్యోగస్తులపై దాడులకు దిగి వారిని నానా దుర్భాషలాడుతూ వారి మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు.
గతంలో అలహరి మండలం కస్తూర్బా లో పనిచేస్తున్న ప్రిన్సిపల్ పై టిడిపి నేత బండారు మారుతి వేధింపులు గురి చేశారు అదేవిధంగా దేవనకొండ మండలంలో ఉపాధి సిబ్బందిపై దాడికి తెగబడి వారిని బయటికి పంపించి ఉపాధి కార్యాలయానికి తాళాలు వేసిన ఘటన చోటుచేసుకుంది.
నేడు టీడీపీ ఇంచార్జి ప్రధాన అనుచరులు వీరేష్ అంగన్వాడి సెంటర్ కు ప్రతిరోజు వెళ్లి ఆమెను నాలుగు నెలల నుంచి వేధిస్తుంటే చివరకు ఆ మాటలు తట్టుకోలేక అంగన్వాడి టీచర్ విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడింది,వారి బంధువులు టిడిపి ఇన్చార్జిని వైకుంఠం జ్యోతి ని అడిగితే మాకు సంబంధం లేదు దూరంపెట్టాం అని మాట తప్పించుకున్నారు.
ఏమి జరగక పొతే మావాడే ఏమైనా జరిగితే మా వాడు కాదని చెబుతారు. ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గుండాలను పెంచిపోసిడ్తుంది. భూకబ్జాలు, ఇసుక దోపిడీలు, తెగబడుతున్నారు. విరుపాక్షి.... ఎమ్మెల్యే




