Kurnool: ట్రోఫీ సాధించిన కర్నూలు ఫుట్‌బాల్ జట్టును అభినందించిన ఎంపీ!

Kurnool: నంద్యాలలో జరిగిన అంతర్ జిల్లాల ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన కర్నూలు జిల్లా బాలికల జట్టును ఎంపీ బస్తిపాటి నాగరాజు అభినందించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 7 July 2026 1:49 PM IST
Kurnool
X

Kurnool: ట్రోఫీ సాధించిన కర్నూలు ఫుట్‌బాల్ జట్టును అభినందించిన ఎంపీ!

Kurnool: క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎంపీ బస్తిపపాటి నాగరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలో నిర్వహించిన సబ్ జూనియర్ బాలికల అంతర్ జిల్లాల ఫుట్ బాల్

ఛాంపియన్షిప్ పోటీల్లో గెలుపొంది ట్రోఫీ సాధించిన కర్నూలు జిల్లా జట్టు పంచలింగాలలోని ఎంపీ నివాసం వద్ద ఆయనను కలిశారు..ఈ సందర్భంగా ఎంపీ ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ లో విజయం సాధించిన క్రీడాకారులని అభినందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.ఇక మునగలపాడు వద్ద ఏర్పాటు చేస్తున్న క్రికెట్ స్టేడియం స్థలంలో ఫుట్ బాల్ కి రెండు ఎకరాలు కేటాయించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story