Emmiganur: బీరప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

Emmiganur: ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో వెలసిన శ్రీ బీరప్ప స్వామి బండారు పూజలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు.

S Khaleel, Yemmiganur
Published on: 4 May 2026 4:14 PM IST
Emmiganur
X

Emmiganur: బీరప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

ఎమ్మిగనూరు: రాజకీయంగా కురువలను గుర్తించిన ఏకైక నాయకుడు చంద్రబాబునని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో శ్రీ బీరప్ప స్వామి బండారు పూజలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్బంగా బీరప్ప స్వామికి ఎంపీ బండారాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు..అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కురువల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.. కురువలందరూ ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు..అంతకుముందు గ్రామానికి చేరుకున్న ఎంపీకి గ్రామస్థులు, టీడీపీ శ్రేణులు, కురువ సంఘం నాయకులు భారీ స్వాగతం పలికారు.. ఈ కార్యక్రమంలో కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, డైరెక్టర్ రామకృష్ణ, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur

Next Story