Nandyala: నంద్యాల ఆర్ఏఆర్ఎస్ కేంద్రంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు
Nandyala: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు.
Nandyala: నంద్యాల ఆర్ఏఆర్ఎస్ కేంద్రంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు
నంద్యాల: నంద్యాల కలెక్టరేట్‌లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కార్యాలయం ఆవరణంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ న్యాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు.
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జిల్లా వ్యవసాయ అధికారి నంద్యాల వారు శ్రీ నున్నా వెంకటేశ్వర్లు మరియు అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ జయ లక్ష్మి గార్ల ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో న్యాయ శాఖ మంత్రి వర్యులు ఫరూక్ నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా పాల్గొన్నారు.
మంత్రి వర్యులు నాగలి పట్టి దుక్కి దున్ని రైతులతో మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ఈ ఖరీఫ్ సీజన్ రైతులకు సిరిసంపదలను అందించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వపరంగా రైతులకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. వర్షాలు బాగా పడి రైతులు ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.
ఈ సంవత్సరం ఎలినో ప్రభావం ఉండడం వలన ప్రత్యాన్మాయ పంటలు వేసుకోవాలని నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు వేసుకోవాలని సూచించారు అదేవిధంగా ఎల్ నినో ప్రభావం ప్రత్యాన్మాయ పంటలు వేసుకునేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి ఏరువాక పౌర్ణమి సందర్భంగా పూజలో పాల్గొని ఈ సంవత్సరం రైతులు అధిక దిగుబడి మరియు ఆదాయం పొందేలా ప్రార్థించారు అదేవిధంగా వరి వేసే రైతులు ఏలినో ప్రభావం ఉన్నందున ఆరుతల పంటలు వేసుకోవాల్సిందిగా మరియు అంతర పంటలు సాగు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు.
జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా మాట్లాడుతూ తొలకరి వర్షాలు పడిన వెంటనే 25 నుంచి 30 రకాల విత్తనాలు గల పీఎం డిఎస్ కిట్లను పొలాల్లో చల్లుకొని 45 రోజుల తర్వాత దుక్కి చేసుకోవడం ద్వారా నేలలో భూసారం పెరుగుతుందని తెలియజేశారు. ఈ సంవత్సరం జిల్లా రైతులందరూ వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటలు వేసుకోవాలని మరియు భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులను వాడాలన్నారు,
ఈ సంవత్సరం నుండి యూరియా మరియు DAP APAIMS అప్లికేషన్ ద్వారా సరఫరా చేయబడుతుందని వాటి ద్వారా రైతు కు వారి పంటకు ఎంత అవసరమో అంతే సరఫరా చేయబడుతుందని తెలియజేసారు. యూరియా అధికంగా వాడడం ద్వారా నేల ఆరోగ్యం దెబ్బతింటుందని, అవసరం మేరకే యూరియా మరియు DAP ఎరువులను వాడాలని తెలిపారు.
వాటికి ప్రత్యాన్మాయంగా పిల్లి పెసర మరియు జీలుగ వంటి పచ్చి రొట్టె ఎరువులను వేయడం ద్వారా భూమిలో కర్భన శాతాన్ని పెంచి భూసారాన్ని పెంచుతాయని, యూరియా DAP స్థానంలో కాంప్లెక్స్ ఎరువులు వాడాలని అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంభించాలని తద్వారా నేల ఆరోగ్యం కాపాడాలని రైతులకు సూచించారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లి ఒకే పంట కాకుండా మూడు నుంచి ఐదు పంటలు వేసుకోవాలని తద్వారా రైతు నష్టపోకుండా ఉండగలడని తెలియజేశారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం మనిషి ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుందని సూచించారు.
ఈ కార్యక్రమం లో మార్కెట్ యార్డ్ చైర్మన్ హరి బాబు గారు , జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ జయ లక్ష్మి గారు,మార్కుఫెడ్ మేనేజర్ హరినాథ్ రెడ్డి,మండల కన్వీనర్ మునగాల విశ్వనాధ్ రెడ్డి, తులసి రెడ్డి గారు గారు , FCI డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.




