Nandyal: నెహ్రూ నగర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభించిన బైరెడ్డి శబరి

Nandyal: నెహ్రూ నగర్‌లో రూ.25 లక్షల సిమెంట్ రోడ్లను ప్రారంభించిన ఎంపీ బైరెడ్డి శబరి గ్రామాభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 9 May 2026 5:44 PM IST
Nandyal
X

Nandyal

Nandyal: గ్రామాల్లో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఉమ్మడి ప్రభుత్వం అని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామంలో రూ. 25 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించి, మూర్వకొండ శ్రీ అభయాంజనేయ స్వామి, నెహ్రూ నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాల ధ్వజ స్థంబాలు, విగ్రహాలు ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొన్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆనాడు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన సమయంలో మా నాన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి గ్రామాల్లో చేపట్టిన సిమెంట్ రోడ్లు, చెక్ డ్యామ్ లు, నీటి కుంటలు నేటికీ ప్రజలకు ఉపయోగపడడం సంతోషంగా ఉందని, సీఎం చంద్రబాబు ద్వారానే అభివృద్ధి సాధ్యం అన్నారు. రూ.25 లక్షలే కాదు గ్రామానికి మరికొంత నిధులు మంజూరు చేసి నెహ్రూ నగర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా అన్నారు. ఒకే సారి రెండు నూతన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాల్లో జరిగే పూజ కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టమని ఎంపీ డాకర్ బైరెడ్డి శబరి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ కట్టుబడి శ్రీనివాస నాయుడు, మాజీ జడ్పీటీసీ నాగేశ్వరావు, బి ఎస్ ఎన్ ఎల్ సలహా కమిటీ సభ్యులు కురువ రమేష్, రఘురామిరెడ్డి, సుధాకర్ రెడ్డి, జయరామిరెడ్డి, మురళి, ధర్మ క్షేత్ర, పి ఆర్ డి ఈ, ఏ ఈ, తహసీల్దార్, గ్రామ టీడీపీ నాయకులు, ఆలయాల కమిటీ పెద్దలు పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story