Markapur: వైసీపీకి యువత గుడ్‌బై.. టీడీపీలోకి భారీ చేరికలు!
Markapur: మార్కాపురం గిద్దలూరు నియోజకవర్గం కంభంలో వైసీపీకి యువత గుడ్‌బై. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి భారీ చేరికలు.
Markapur: వైసీపీకి యువత గుడ్‌బై.. టీడీపీలోకి భారీ చేరికలు!
Markapur: మార్కాపురం జిల్లా ,, గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. కంభం సొసైటీ బ్యాంక్ చైర్మన్ కేతం శ్రీనివాసులు అధ్యక్షతన కందులాపురం పంచాయతీ, కంభం పట్టణానికి చెందిన 55 మంది యువత వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
కందులాపురం మాజీ సర్పంచ్ కల్వకుంట్ల ఇమ్మానియేలు, మాజీ వార్డు మెంబర్ కటికల మాణిక్యం, అవ్వారి శ్రీనివాసులు, షేక్ షకీల్ తదితరులకు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన యువతకు నాయకులు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పెద్ద సంఖ్యలో యువత టీడీపీలో చేరుతున్నారని నాయకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.




