Nandyal: నందికొట్కూరులో ఎంపీఈఓల సహాయనిరాకరణ 5 రోజుల నిరసన దీక్ష!

Nandyal: నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎంపీఈఓలు 5 రోజుల సహాయనిరాకరణ దీక్ష చేపట్టారు. ఉద్యోగ భద్రత, వేతన పెంపు, చైల్డ్ కేర్ లీవ్‌లు ఇవ్వాలని డిమాండ్.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 20 July 2026 4:57 PM IST
Nandyal
X

Nandyal: నందికొట్కూరులో ఎంపీఈఓల సహాయనిరాకరణ 5 రోజుల నిరసన దీక్ష!

Nandyal: నంద్యాల జిల్లా నందికొట్కూరు వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖలో సహాయకులుగా(MPEO) పనిచేస్తున్న సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో ఐదు రోజుల పాటు సహాయనిరాకరణ దీక్షను చేపట్టారు.

తాము 2014 నుంచి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు పొందామని,ఆనాటి నుంచి నేటి వరకు అదే జీతంతో పనిచేస్తున్నామని, చాలీ చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోవడమే కష్టంగా పనిచేస్తున్నామన్నారు.

గత ప్రభుత్వంలో తమకు ఎటువంటి న్యాయము జరుగకపోగా తిరిగి మళ్ళీ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తమ గోడును పట్టించుకోవడం లేదు అన్నారుతమకు ఉద్యోగ భద్రత కల్పించాలని,పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చెయ్యాలని,ప్రతి ఏటా జరిగే సర్వీసు రెన్యువల్ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని అన్నారు.తమతో పాటు ఎక్కువగా (MPEO)లుగా మహిళలు అత్యధికంగా పనిచేస్తున్నందున వారికి చైల్డ్ కేర్ సెలవులను మంజూరు చెయ్యాలని కోరారు.

వీరికి వామపక్షణాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story