Kurnool: అపరిశుభ్రతపై కర్నూలు కమిషనర్ ఆగ్రహం.. మూడు దుకాణాలకు జరిమానా!
Kurnool: కర్నూలు బాలాజీ నగర్‌లో అపరిశుభ్రతపై నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kurnool: అపరిశుభ్రతపై కర్నూలు కమిషనర్ ఆగ్రహం.. మూడు దుకాణాలకు జరిమానా!
Kurnool: నగరంలోని బాలాజీ నగర్‌లో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వాణిజ్య దుకాణాల వద్ద అపరిశుభ్రత, డ్రైనేజీ సమస్యలపై నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఎన్‌ఆర్ పేట, సుంకేసుల రోడ్డు, బాలాజీ నగర్, మహాలక్ష్మి నగర్, బి.క్యాంపు, తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు.
బాలాజీ నగర్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు డ్రైనేజీ బ్లాక్ కావడంపై సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ పరిశుభ్రత పాటించని శివా వైన్స్, రిహాన్ కాజు చికెన్ పకోడా, జమ్ జమ్ కూల్‌డ్రింక్స్ దుకాణాల నిర్వాహకులకు భారీ జరిమానాలు విధించాలని, అయినప్పటికీ నిబంధనలు పాటించకపోతే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయడంతో పాటు దుకాణాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు.కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు, ఇంస్పెక్టర్లు ఫరుక్, హుస్సేన్, రవి, తదితరులు పాల్గొన్నారు.




