Atmakur: పెచెర్వు గూడెంలో డ్రైవింగ్ లైసెన్సుల పంపిణీ
Atmakur: నల్లమల పెచెర్వు గూడెం చెంచు యువతకు ఆత్మకూరు ఎంవీఐ సత్యనారాయణ రెడ్డి సొంత ఖర్చుతో డ్రైవింగ్ లైసెన్సులు పంపిణీ చేశారు.
Atmakur: పెచెర్వు గూడెంలో డ్రైవింగ్ లైసెన్సుల పంపిణీ
Atmakur: ఒకనాటి ఆదివాసి నల్లమల చెంచుల రాజధానిగా వెలుగొందిన పెచెర్వు గూడెం చరిత్ర ఆధారాలకు మూలమని మానవ జీవ పరిమాణ క్రమానికి అనుసంధానమైన ఈ ప్రాంత చెంచు గిరిజనుల అభివృద్ధి కీలకమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు విభాగం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి నల్లమల లోని పెచెర్వు గూడెంలో 42 మంది చెంచు యువకులకు తన సొంత నిధులతో డ్రైవింగ్ లైసెన్స్లను అందజేశారు.
ఆత్మకూరు నల్లమల చెంచు గిరిజన యువకులు సహజ సిద్ధంగా మేధావులని, వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీసి స్వయం ఉపాధికి తన బాధ్యతగా డ్రైవింగ్ లైసెన్స్ లను గత కొంతకాలంగా అందిస్తున్నారని తెలిపారు. నల్లమల చెంచు యువత విద్య, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందడానికి వ్యక్తిగతంగా సహకరిస్తానని ఆత్మకూరు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
సామాజిక బాధ్యతతో సొంత నిధులతో నల్లమల చెంచు యువకులకు డ్రైవింగ్ లైసెన్సులను అందిస్తున్న ఎం వి ఐ అధికారిని ఎమ్మెల్యే అభినందించారు. నల్లమల చెంచులు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ప్రతి ఒక్కరు ఆత్మకూరు ఎంవిఐ అధికారి సత్యనారాయణ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.




