Nandyal: నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో ఘనంగా వరుణ యాగం!
Nandyal: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో వర్షాలు కురవాలని కోరుతూ వరుణ యాగం, వరుణ జపాలు నిర్వహించిన దేవాదాయ శాఖ.
Nandyal: నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో ఘనంగా వరుణ యాగం!
Nandyal: బనగానపల్లె మండలం నందవరంలో కాశీ విశాలాక్షి ప్రతిరూపమైన చౌడేశ్వరి దేవి ఆలయంలో దేవాదాయ ఆధ్వర్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు.
ఉదయం 7 గంటల కు వరుణయాగ, వరుణ జపాలు ప్రారంభం అయ్యాయి నందవరం గ్రామంలోని ప్రజలు భక్తులు ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక బిందె నీటిని తీసుకొని దేవస్థానం వద్దకు చేరుకుని చౌడేశ్వరి అమ్మవారికి సమర్పించి వరుణ యాగం నిర్వహించారు
రైతులు బాగుండాలని పంటలు సస్యశ్యామలంగా ఉండాలని వర్ణ యాగం చేశామన్నారు నందవరం చౌడేశ్వరి దేవి కరుణతో త్వరలోనే మంచి వర్షాలు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమం లో ఆలయ చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి వేద పండితులు తదితరులు పాల్గొన్నారు




