Nandikotkur: నందికొట్కూరులో దూసుకెళ్లిన కూటమి ప్రచార రథం
Nandikotkur: నందికొట్కూరు మున్సిపాలిటీ 5, 12వ వార్డుల్లో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి సాబేరున్నిసా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Nandikotkur: నందికొట్కూరులో దూసుకెళ్లిన కూటమి ప్రచార రథం
నంద్యాల జిల్లా: నందికొట్కూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం రోజురోజుకీ వేడెక్కుతోంది. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య సోమవారం పట్టణంలోని 5వ వార్డు, 12వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఉదయం నుంచే ప్రారంభమైన ఈ ప్రచారంలో ఎమ్మెల్యే వెంట నందికొట్కూరు కూటమి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి, ప్రముఖ న్యాయవాది, క్లస్టర్ ఇన్‌చార్జ్ జాకీర్ హుస్సేన్ సతీమణి శ్రీమతి మొల్ల సాబేరున్నిసా, 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షీలార్ బీ, 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షేక్షావలి పాల్గొన్నారు.
వార్డుల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. మహిళలు, వృద్ధులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఎమ్మెల్యేకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడుతూ...
నందికొట్కూరు పట్టణ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి నిధులు తీసుకొచ్చాం. ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే మున్సిపాలిటీలో కూడా కూటమి జెండా ఎగరాలి. సైకిల్ గుర్తుపై మీ రెండు ఓట్లు - ఒకటి చైర్‌పర్సన్‌కి, రెండోది వార్డు కౌన్సిలర్‌కి వేసి మా అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి" అని విజ్ఞప్తి చేశారు.
కూటమి శ్రేణుల్లో జోష్
ప్రచారంలో పట్టణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, వార్డు ఇన్‌చార్జులు, బూత్ కమిటీ సభ్యులు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. "జై చంద్రబాబు, జై కూటమి" నినాదాలతో వార్డులు మార్మోగాయి.
12వ వార్డులో ముస్లిం మైనారిటీ కుటుంబాలు చైర్‌పర్సన్ అభ్యర్థి సాబేరున్నిసా కు ప్రత్యేకంగా మద్దతు ప్రకటించడం విశేషం.
ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే ఉండటంతో కూటమి ప్రచారం మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే నాయకులకు దిశానిర్దేశం చేశారు.




