Nandikotkur: తాగునీరు అందించే వరకు పోరాటం కొనసాగిస్తాం పిక్కిలి వెంకటేశ్వర్లు

Nandikotkur: నందికొట్కూరులో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Updated on: 31 Aug 2026 10:10 PM IST
Nandikotkur
X

Nandikotkur: తాగునీరు అందించే వరకు పోరాటం కొనసాగిస్తాం పిక్కిలి వెంకటేశ్వర్లు

నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో తీవ్రంగా నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, మున్సిపల్ కమిషనర్ జి. వెంకటరామిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

32 వార్డులు, సుమారు 60 వేల జనాభా ఉన్న పట్టణానికి నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే నీరు రావడం దారుణమని అన్నారు. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోతుండగా, ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

మల్యాల పంప్‌హౌస్‌ నుంచి నందికొట్కూరు కు ఉన్న 60 ఏళ్ల పాత పైప్‌లైన్‌ను వెంటనే మార్చి కొత్త పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని, అదనపు మోటర్లు ఏర్పాటు చేసి నిరంతర నీటి సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని కోరారు.

తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజలను సమీకరించి మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి. రామకృష్ణ, కాటేపోగు సోమన్న, మేకల చంద్రశేఖర్, వేల్పుల ఏసన్న, ముజీప్ రెహ్మాన్, బి. లక్ష్మీదేవి, షేక్ బీబీ తదితరులు పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)