Nandikotkur: జీవో 396 రద్దు చేయాలి డాక్యుమెంట్ రైటర్ల సమ్మె!

Nandikotkur: జీవో నెం.396 కు నిరసనగా నందికొట్కూరులో డాక్యుమెంట్ రైటర్ల నిరవధిక సమ్మె. జూలై 31 వరకు పెన్‌డౌన్. నిలిచిపోయిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సేవలు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 20 July 2026 5:50 PM IST
Nandikotkur
X

Nandikotkur: జీవో 396 రద్దు చేయాలి డాక్యుమెంట్ రైటర్ల సమ్మె!

Nandikotkur: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.396 ను వ్యతిరేకిస్తూ నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో డాక్మెంట్ రైటర్స్ సోమవారం నుంచి నిరవధిక పెన్‌డౌన్ కార్యక్రమం ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమ్మె జూలై 20 నుంచి జూలై 31, 2026 వరకు కొనసాగుతుందని సంఘ నాయకులు ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సేవా కేంద్రాలు వస్తే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది డాక్మెంట్ రైటర్స్ ఉపాధి కోల్పోతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల మధ్యవర్తులు పెరిగి అవినీతికి ఆస్కారం ఉంటుందని, ప్రజల ఆస్తులు, భూ రికార్డులకు ఎలాంటి భద్రత ఉండదని ఆరోపించారు.

రైటర్స్ సమ్మె ప్రభావంతో నందికొట్కూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. భూములు కొనుగోలు, అమ్మకం, బ్యాంకు రుణాల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి ఉండి నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

GO 396ను వెంటనే రద్దు చేయాలని, తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపాలని డాక్మెంట్ రైటర్స్ డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు మాలిక్, మన్సూర్, కిరణ్ మరియు వీరి పెన్డౌన్ కార్యక్రమానిక్ సీపీఐ ఎం ఎల్ పార్టీ తరుపున పిక్కిలి వెంకటేశ్వర్లు మద్దతు ప్రకటించారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story