Nandikotkur: కోటా పాఠశాలలో జాతీయ క్రీడా & తెలుగు భాషా దినోత్సవ వేడుకలు!
Nandikotkur: నందికొట్కూరు బైరెడ్డి నగర్ ZPHS కోటా పాఠశాలలో మేజర్ ధ్యాన్ చంద్, గిడుగు రామ్మూర్తిల జయంతి వేడుకలు. క్రీడలు, చదువు సమానమని హెచ్ఎం కౌసల్యా బాయి స్పష్టం.
Nandikotkur: కోటా పాఠశాలలో జాతీయ క్రీడా & తెలుగు భాషా దినోత్సవ వేడుకలు!
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కోట)బాలురు నందు హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని "జాతీయ క్రీడా దినోత్సవం" వేడుకలు అలాగే గిడుగు రామ మూర్తి పంతులు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ముందుగా ధ్యాన్ చంద్ గారి చిత్రపటానికి మరియు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కౌసల్యా బాయి గారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించి విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు.. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ మాట్లాడుతూ ధ్యాన్ చంద్ క్రీడా జీవితం గురించి సవివరంగా వివరించారు.
ధ్యాన్ చంద్ జీవితాన్ని నేటి తరం వారు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి గారి జీవిత చరిత్ర గురించి వివరించారు. ఉపాధ్యాయ సిబ్బంది అందరూ తమ ప్రసంగాల్లో ధ్యాన్ చంద్ గారిని, గిడుగు రామ్మూర్తి పంతులు గారిని కొనియాడారు.అనంతరం క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యం చూపరులను ఆకట్టుకుంది.అనంతరం విద్యార్థిని విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకట రమణ, ఈశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి, రామిరెడ్డి, ఉపాధ్యాయిని లు లలితమ్మ, లలిత కుమారి, అనిత తదితరులు పాల్గొన్నారు.




