Nandyal: ఇంటి స్థలం కబ్జా చేశారని మహిళా ఆత్మహత్య యత్నం

Nandyal: నంద్యాల జిల్లా నందికొట్కూరులో భూకబ్జాపై విసిగిపోయిన సుభద్ర బాయి అనే మహిళ మంగళవారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 2 Jun 2026 9:30 PM IST
Nandyal
X

Nandyal: ఇంటి స్థలం కబ్జా చేశారని మహిళా ఆత్మహత్య యత్నం

Nandyal: తమ ఇంటి స్థలం కబ్జా చేశారని బాధిత మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మంగళవారం జరిగింది. పట్టణంలోని సర్వే నెంబర్ 284/ఏ1లో ప్లాట్ నెంబర్ 408 లో 0.03 సెంట్లు ప్రకారం సుభద్ర బాయి, మరియు శేషారాం సింగ్ లకు 2012లో ఆత్మకూరు రోడ్డులో ఇంటి స్థలాలను మంజూరు చేస్తూ పట్టా పంపిణీ చేయడం జరిగింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఇంటి స్థలాలను వైసీపీ నుంచి టీడీపీ పార్టీలో చేరిన మైనారిటీ నాయకుడు కబ్జా చేసినట్లు తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని 25మే 2026లో ప్రజా సమస్యల పరిస్కార వేదికలో ఫిర్యాదు చేశారు. సమస్య పరిస్కారం కాకపోవడం తో మంగళవారం బాధితులు ఇంటి స్థలం వద్ద ఆందోళనకు దిగారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినారు. పోలీసులు స్పందించి ఆత్మహత్య ను బగ్నం చేశారు. మహిళా ఒంటిపై నీళ్లు చల్లి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story