Nandikotkur: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యను దళిత సమాజం మరువదు

Nandikotkur: వైఎస్సార్సీపీ హయాంలో దళితులపై జరిగిన అరాచకాలపై నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మండిపడ్డారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 20 May 2026 5:35 PM IST
Nandikotkur
X

Nandikotkur: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యను దళిత సమాజం మరువదు

నందికొట్కూరు: వైసీపీ హయాంలో ఎస్సీలపై జరిగిన ప్రధాన దౌర్జన్యాలపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్ఫీ వద్ద మాజీ డ్రైవర్గా పనిచేసిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీతో తలెత్తిన వివాదం కారణంగా డ్రైవర్ మృతదేహ ఘటనను దళిత సమాజం ఇప్పటికీ మరచిపోలేదన్నారు. ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చి వాళ్ల ఇంటి వద్దే పడేసి, మొదట్లో దీనిని ఒక ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, తీవ్రంగా కొట్టడం వల్లే ఆయన మరణించాడని దర్యాప్తులో వెల్లడైంది అన్నారు.

దళితులను చంపిన వ్యక్తులను ఆనాడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ అండతో అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేసినారో వారిలో జవాబు దారీతనం ఎంతలా లోపించిందో చెప్పడానికి అ ఘటనే స్పష్టమైన నిదర్శనం అన్నారు. ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ అనస్థీటిస్ట్, కోవిడ్-19 సమయంలో పీపీఈ కిట్ల కొరత గురించి ఆందోళనలు లేవనెత్తిన తర్వాత సస్పెండ్ చేయబడి, బహిరంగంగా వేధింపులకు గురికాబడి.

అనంతరం ఆయనను అరెస్టు చేసి అవమానించారు, తద్వారా వైసీపీ పాలనలో ప్రశ్నించే గొంతుకల అణిచివేతకు మరియు ఎస్సీ వృత్తినిపుణులను లక్ష్యంగా చేసుకుని వేధించడానికి ఆయన ఒక సజీవ సాక్ష్యంగా, ఒక ప్రతీకగా మిగిలిపోయారు అని పేర్కొన్నారు. ఈ ఘటనలన్నీ కలిపి చూస్తే.. ముఖ్యంగా ఎస్సీ వ్యక్తులు, వృత్తిపరమైన నిపుణులు, మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలపై వైసీపీ హయాంలో నిరంతర బెదిరింపులు, దౌర్జన్యాలు హింస, మరియు వ్యవస్థాగత అన్యాయాలకు ఇవి అద్దం పట్టాయి .

అలాగే వైసీపీ ప్రభుత్వ హయంలో సి.ఎస్. ఐ సంఘాల భూములను సైతం విడిచిపెట్టకుండా ఇబ్బంది పెట్టిన ఘనత జగన కే చెల్లుతుంది అన్నారు. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి గారు, పలుచాని మహేశ్వరరెడ్డి, పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story