Nandikotkur: నందికోట్కూరు చైర్మన్ బరిలో షేక్ ఫాతిమాబీ
Nandikotkur: నందికోట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా షేక్ ఫాతిమాబీ నామినేషన్ దాఖలు చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
Nandikotkur: నందికోట్కూరు చైర్మన్ బరిలో షేక్ ఫాతిమాబీ
నందికోట్కూరు: నందికోట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా షేక్ ఫాతిమాబీ నామినేషన్ పత్రాన్ని మున్సిపల్ కార్యాలయంలో దాఖలు చేసినా అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తనకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి, నియోజకవర్గ సమన్వయకర్త డా. సుధీర్ దారాకి హృదయపూర్వక కృతజ్ఞతలు.
నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపిన ప్రతి నాయకుడికి,కార్యకర్తకు, మహిళా సోదరీమణులకు పేరుపేరునా ధన్యవాదాలు. ఇది కేవలం నామినేషన్ మాత్రమే కాదు,నందికోట్కూరు అభివృద్ధికి నాంది.
మీ ఆశీర్వాదం,మీ అండ నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను..మీ ఇంటి ఆడబిడ్డగా సేవ చేసే అవకాశం ఇవ్వండి అని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా పట్టణ ప్రజలను కోరిన షేక్ ఫాతిమా బీ వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి, నందికోట్కూరు.




