Nandikotkur: నందికొట్కూరు 12వ వార్డులో షేక్ షేక్షావలి విస్తృత ప్రచారం!

Nandikotkur: నందికొట్కూరు 12వ వార్డులో టీడీపీ అభ్యర్థి షేక్ షేక్షావలి విస్తృత ప్రచారం. నవంబర్ 1న సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 26 Oct 2026 11:53 PM IST
Nandikotkur
X

Nandikotkur: నందికొట్కూరు 12వ వార్డులో షేక్ షేక్షావలి విస్తృత ప్రచారం!

నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ 12 వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్. షేక్షావలి(షేర్)ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక నాయకులతో కలిసి వార్డులో పర్యటిస్తున్నారు.

ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తూ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అదేవిధంగా కూటమి ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ పథకాలు, స్థానిక అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తు ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నారు.

స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఓటర్లకు భరోసా ఇస్తు సైకిల్ గుర్తుకు ఓటు వేసి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, నవంబర్ 1న జరగబోయే ఎన్నికల పోలింగ్‌లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

ప్రచారంలో నేను సైతం అంటూ తన కుమారుడు ఇర్ఫాన్ స్థానిక వార్డులోని యువకులతో మమేకమై వార్డులోని ప్రతి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఓటుకోసం అభ్యర్థిస్తున్న తీరుకు వార్డు ప్రజలు ముగ్ధులౌ తున్నారు.

మొదటినుంచి 12వ వార్డు అభ్యర్థి అయిన షేక్షావలి(షేర్) కుటుంబం రాజకీయ నేపథ్య కుటుంబమే. వార్డులోని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా అక్క,అత్త,మామ అంటూ పిలుస్తూ తనకు ఓటు వేసి వార్డు అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరుతున్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)