Nandikotkur: మైనర్లకు బైక్ ఇస్తే.. యజమానికి జైలు శిక్షే!
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎస్ఐ చంద్రశేఖర్ వాహన తనిఖీలు నిర్వహించారు.
Nandikotkur: మైనర్లకు బైక్ ఇస్తే.. యజమానికి జైలు శిక్షే!
Nandikotkur: వేసవి సెలవుల్లో పిల్లలకు వాహనాలు ఇవ్వడం ప్రాణాలతో చెలగాటమేనని నందికొట్కూరు ఎస్ఐ చంద్రశేఖర్ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలో వాహన తనిఖీలు నిర్వహించిన ఆయన తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు.
సరదా కోసం మైనర్లు బైక్ నడిపితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిపారు. మైనర్లకు వాహనం ఇవ్వడం చట్టరీత్యా నేరమని, పట్టుబడితే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కఠిన చర్యలతో పాటు భారీ జరిమానా, జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, రాంగ్ రూట్‌లో ప్రయాణం, మితిమీరిన వేగం ప్రాణాంతకమని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణరక్షక కవచమని పేర్కొన్నారు.
సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు టైర్లు, బ్రేకులు, ఇంజన్ కండిషన్ తనిఖీ చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు పగటిపూట ప్రయాణించి రాత్రిపూట విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




