వైసిపి నేత సుధీర్ సవాల్‌ను తిప్పికొట్టిన నందికొట్కూరు టీడీపీ నేతలు!

Nandikotkur: నందికొట్కూరు మార్కెట్ యార్డులో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు రెండేళ్ల కార్యక్రమంపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 13 Jun 2026 9:08 PM IST
Nandikotkur
X

వైసిపి నేత సుధీర్ సవాల్‌ను తిప్పికొట్టిన నందికొట్కూరు టీడీపీ నేతలు!

Nandikotkur: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నందికొట్కూరును నాశనం చేసిన నేతలు, నేడు అభివృద్ధి గురించి మాట్లాడటం దొంగే దొంగ అన్నట్లు ఉంది" అని విమర్శించారు. "ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన మున్సిపల్ కార్యాలయాన్ని స్మశాన వాటిక పక్కన డంపింగ్ యార్డ్ దగ్గరకు తరలించాలని వైసీపీ కుట్ర చేసింది. శంకుస్థాపన చేసి పనులు మధ్యలో వదిలేసింది మీరే కదా?" అని ప్రశ్నించారు.

"మున్సిపల్ చైర్మన్ సహా మెజార్టీ వైసీపీ కౌన్సిలర్లు మీ సిద్ధాంతాలు నచ్చక, అవినీతిని భరించలేక టీడీపీలో చేరారు. సొంత కౌన్సిలర్లనే కాపాడుకోలేని మీరు నీతులు చెప్పడం విడ్డూరం" అని ఎద్దేవా చేశారు.

"గత ప్రభుత్వంలో ప్రతి పనిలో పర్సెంటేజీలు వసూలు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆధ్వర్యంలో పారదర్శకంగా పనులు జరుగుతుంటే కమీషన్లు ఆగిపోయాయనే బాధ మీ మాటల్లో కనిపిస్తోంది" అని ఆరోపించారు.

"వైసీపీ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన షాదీఖానా పనులను, లోపాలను సరిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు" అని తెలిపారు. వైసిపి నేత డా. సుధీర్ ను ఉద్దేశించి టీడీపీ నేతలు మాట్లాడుతూ, "అవినీతి గురించి నువ్వా నాకు నేర్పించేది. రా, ప్రజల్లో వచ్చి మాట్లాడు. 2 సంవత్సరాలు అయ్యింది. వచ్చే రోజుల్లో దీనికి నువ్వు కచ్చితంగా పశ్చాత్తాప పడే రోజు వస్తుంది గుర్తు పెట్టుకో" అని హెచ్చరించారు.

"ఏ పల్లెలోనూ తెలుగుదేశం జెండా ఎగరకూడదు అని మాట్లాడే ముందు 2024 ఎన్నికల్లో నందికొట్కూరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన విషయం గుర్తుపెట్టుకోండి. 'వై నాట్ 175' అంటూ విర్రవీగిన మీ అధినేతకు రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. డబ్బులు వెదజల్లినా ప్రజలు మీకు బుద్ధి చెప్పారు" అని అన్నారు.

ప్రజల గుండెల్లో ఉన్న టీడీపీ జెండా గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లెల్లో మీ వైసీపీ జెండా ఎగురుతుందో లేదో చూసుకోండి అని టీడీపీ నేతలు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డు చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, యాదవ కార్పరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్,సింగిల్ విండో చైర్మన్లు మూర్తుజవలి ,శ్రీనివాసులు మరియు టీడీపీ మండల కన్వీనర్లు మాండ్ర సురేంద్రనాథరెడ్డి ,గుండ్రెడ్డి మోహనరెడ్డి, కాతా రమేష్ రెడ్డి, పలుచాని మహేశ్వర్ రెడ్డి మరియు ఎస్. సి, ఎస్.టి మానిటరింగ్ సభ్యులు లింగాల స్వాములు పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story