Nandikotkuru: నందికొట్కూరులో వైకాపా ప్రచారం: దారా సుధీర్!

Nandikotkuru: 21వ వార్డు వైకాపా ప్రచారంలో డాక్టర్ దారా సుధీర్ పాల్గొని, చైర్‌పర్సన్ అభ్యర్థి ఫాతిమా బీ, కౌన్సిలర్ అభ్యర్థి సమీరా భానును గెలిపించాలని కోరారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 29 Oct 2026 11:25 AM IST
Nandikotkuru
X

Nandikotkuru: నందికొట్కూరులో వైకాపా ప్రచారం: దారా సుధీర్!

Nandikotkuru: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ పాల్గొని ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా నందికొట్కూరు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీమతి షేక్ ఫాతిమా బీ,, 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి యం. సమీరా భానుకు మద్దతుగా ఆయన ప్రజలను కలుసుకుని ఎన్నికల ప్రచారం చేపట్టారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలియజేయాలని కోరారు.

ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ ఫాతిమా బీతో పాటు 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి యం. సమీరా భానును భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ ప్రచారంలో వైసిపి నాయకులు షేక్ హారూన్, అజ్మత్ భాష, మునీర్, మున్నా వార్డు ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)