Nandikotkuru: నందికొట్కూరులో శివానందరెడ్డి టీడీపీ ప్రచారం!
Nandikotkuru: నందికొట్కూరు ఎన్నికల్లో శివానందరెడ్డి టీడీపీ ప్రచారం నిర్వహించి, అభ్యర్థులు సబేరున్నిసా, సుమలత, సరితలను గెలిపించాలని కోరారు.
Nandikotkuru: నందికొట్కూరులో శివానందరెడ్డి టీడీపీ ప్రచారం!
Nandikotkuru: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నందికొట్కూరు మున్సిపల్ తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థి మొల్ల సబేరున్నిసాకు మరియు 15వ వార్డు టీడీపీ అభ్యర్థి కౌన్సిలర్ దేశెట్టి సుమలతకు, 17వ వార్డు కౌన్సిలర్ టీడీపీ అభ్యర్థి దేశెట్టి సరితకు మద్దతుగా నందికొట్కూరు టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర శివానందరెడ్డి షికారిపేట, సుబ్బరావు పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, సైకిల్ గుర్తుకు తమ రెండు ఓట్లు వేసి, టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు పట్టణ స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.




