Banaganapalle: బనగానపల్లెలో హజ్రత్ సయ్యద్ మీర్ హాషం అలీ ఉర్సు మహోత్సవాలు!

Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు జరగనున్న హజ్రత్ సయ్యద్ మీర్ హాషం అలీ ఉర్సు మహోత్సవాల గోడపత్రికను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు.

Ramanaiah, Banaganepalle
Published on: 21 Nov 2026 12:27 PM IST
Banaganapalle
X

Banaganapalle: బనగానపల్లెలో హజ్రత్ సయ్యద్ మీర్ హాషం అలీ ఉర్సు మహోత్సవాలు!

బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో కొలువైన హజ్రత్ సయ్యద్ మీర్ హాషం అలీ ఉర్సు దెహలివాలే సాహెబ్ రహ్మతుల్లా అలైహి వారి గంధం, ఉర్సు మహోత్సవాలకు సంబంధించిన గోడపత్రికను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లెలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఉర్సు మహోత్సవాల నిర్వాహకులు కార్యక్రమ వివరాలను మంత్రికి వివరించారు. నవంబర్ 30న రాత్రి 10 గంటలకు గంధం కార్యక్రమం, డిసెంబర్ 1న ఉర్సు మహోత్సవం, డిసెంబర్ 2న జియారత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

గంధం కార్యక్రమంలో చాందిని డెకరేషన్, ప్రత్యేక లైటింగ్, డ్రమ్స్ ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 1న రాత్రి 9 గంటలకు ఉత్తరప్రదేశ్ (లక్నో)కు చెందిన కళాకారులతో ముఖాముఖి పోటీల రూపంలో ప్రత్యేక ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించనున్నారు.

హజ్రత్ సయ్యద్ అహ్మద్ బాషా ఖాద్రి రహ్మతుల్లా అలైహి వారి కుమారులు డాక్టర్ హుసేనిబాషా సాహెబ్ ఆధ్వర్యంలో గంధం, ఉర్సు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఖవ్వాలి కార్యక్రమానికి సహకారంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రూ.లక్ష విరాళంగా అందించారు. కార్యక్రమ నిర్వహణకు పలువురు దాతలు, ఆహ్వాన కమిటీ సభ్యులు, దర్గా కమిటీ సభ్యులు సహకారం అందిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో మతసామరస్యం, సోదరభావం వెల్లివిరిసేలా భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle