Nandyal: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. బిసి రాజారెడ్డి

Nandyal: నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ఉచిత స్వయం ఉపాధి శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి సర్టిఫికెట్లు అందజేశారు.

Ramanaiah, Banaganepalle
Published on: 27 May 2026 3:36 PM IST
Nandyal
X

Nandyal: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. బిసి రాజారెడ్డి

Nandyal: భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ద్వారా మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తూ ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేయాలని ఉద్దేశంతో మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా బనగానపల్లె నాలుగో సచివాలయం నందు MSME కోఆర్డినేటర్ సునీల, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఫక్రుబి, బ్యూటీషియన్ ట్రైనర్ మెహరాజీ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్, అల్లికలు, నేత, ఎంబ్రాయిడరీ వంటి తదితర విభాగాలలో నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చారు. ఈమేరకు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు బిసి రాజారెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా బిసి రాజారెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఒకప్పుడు వంటింటికే పరిమితమయ్యే వారని, ప్రస్తుత కాలంలో చాలామంది స్వయం ఉపాధి, వ్యాపార, ఉద్యోగ, రాజకీయ తదితర రంగాల్లో రాణిస్తుండడం అభినందనీయమన్నారు. మహిళలు ఎంతో ధైర్యవంతులన్నారు. మహిళలు స్వయం ఉపాధిలో భాగంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని, అలాంటి వారికి ప్రభుత్వ ప్రోత్సాహం తప్పనిసరిగా ఉంటుందన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story