Dhone: ఎద్దుపెంటలో తాగునీటి సమస్యపై గ్రామ సచివాలయం ముట్టడి

Dhone: నంద్యాల జిల్లా డోన్ మండలం ఎద్దుపెంట దళిత కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ముట్టడి.

Bharat Raj, Dhone
Published on: 4 Aug 2026 4:22 PM IST
Dhone
X

Dhone: ఎద్దుపెంటలో తాగునీటి సమస్యపై గ్రామ సచివాలయం ముట్టడి

డోన్: నంద్యాల జిల్లా, డోన్ మండలం ఎద్దుపెంట గ్రామంలోని దళిత కాలనీ ప్రజలు గత మూడు నెలలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ నాయకులు ఆరోపించారు.

సమస్య పరిష్కారంలో అధికారులు విఫలమయ్యారని, ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారని విమర్శించారు. శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామ సచివాలయాన్ని సీపీఐ నాయకులు ముట్టడించారు.

వెంటనే సమస్యను పరిష్కరించకపోతే డోన్ మండల ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగ నాయుడు, నారాయణ హెచ్చరించారు.

ఈ నిరసనలో ఎర్రిస్వామి, కోయాలకొండ నాగరాజు, వరదరాజులు, పృథ్వీకుమార్, ఓబుళపురం వెంకట్రాముడు, జయరాముడు, సాంటే సుధాకర్, పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు.

Bharat Raj, Dhone

Bharat Raj, Dhone