Nandyal: నంద్యాలలో విషాదం.. గోదావరి కేఫ్ యజమాని ఆత్మహత్య!

Nandyal: నంద్యాలలోని ఎస్‌బీఐ కాలనీలో గోదావరి కేఫ్ యజమాని నవీన్ ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

R Pavankalyan, Nandyal
Published on: 25 Aug 2026 11:50 AM IST
Nandyal
X

Nandyal: నంద్యాలలో విషాదం.. గోదావరి కేఫ్ యజమాని ఆత్మహత్య!

Nandyal: నంద్యాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్‌బీఐ కాలనీలోని శిల్ప టవర్స్‌లో గోదావరి కేఫ్ యజమాని నవీన్(25) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోని వంటగదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన నవీన్.. రెండేళ్ల క్రితం నంద్యాలకు వచ్చి పద్మావతినగర్‌లో గోదావరి కేఫ్‌ను ఏర్పాటు చేశారు. తక్కువ సమయంలోనే కేఫ్‌కు మంచి పేరు తీసుకువచ్చారు.

మధ్యాహ్నం ఇంటికి వచ్చిన నవీన్.. తల్లి సరోజమ్మ ఇంట్లో లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నవీన్ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story