Nandyal: నంద్యాలలో పీసీపీఎన్డీటీ డీఎల్‌ఏసీ కమిటీ సమావేశం నిర్వహణ!

Nandyal: నంద్యాలలో డీఎంహెచ్‌వో డాక్టర్ శారదాబాయి ఆధ్వర్యంలో పీసీపీఎన్డీటీ డీఎల్‌ఏసీ కమిటీ సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 30 Sept 2026 7:01 PM IST
Nandyal
X

Nandyal: నంద్యాలలో పీసీపీఎన్డీటీ డీఎల్‌ఏసీ కమిటీ సమావేశం నిర్వహణ!

Nandyal: నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం లో పిసిపిఎన్డిటి డిఎల్ఎసి కమ టి మీటింగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శారద బాయి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ శారదాబాయి మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులు స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే నిర్వాహకుల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు జైలు శిష్యులు తప్పదని హెచ్చరించారు.

చట్ట ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం ప్రోత్సహించడం నేరమన్నారు. సమాజానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆడబిడ్డ ముఖ్యమని ఆడబిడ్డను రక్షించే బాధ్యత సమాజంలోని ప్రతి పౌరునికి ఉందని తెలియజేశారు స్కానింగ్ సెంటర్లలో ధరల బోర్డులు ప్రదర్శించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లైన డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ శ్రవణ్ కుమార్ , జిల్లా ఎక్స్టెన్షన్ అండ్ మాస్ మీడియా అధికారి మల్లేపల్లి పామన్న. డాక్టర్ సలీమున్నీసా బేగం నంద్యాల బర్డ్ ఎన్జీవోప్రతినిధి వినయ్ బాబు, వంశీ పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL