Nandyal: నంద్యాల జడ్పీ పీఠంపై బనగానపల్లె జడ్పీటీసీ బురానుద్దీన్!

Nandyal: నంద్యాల జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా బనగానపల్లె జడ్పీటీసీ బురానుద్దీన్ పేరును టీడీపీ అధిష్టానం ప్రకటించింది. మంత్రి బీసీ జనార్ధనరెడ్డి వ్యూహంతో ఈ పదవి దక్కింది.

Ramanaiah, Banaganepalle
Updated on: 20 Nov 2026 10:40 AM IST
Nandyal
X

Nandyal: నంద్యాల జడ్పీ పీఠంపై బనగానపల్లె జడ్పీటీసీ బురానుద్దీన్!

నంద్యాల: నంద్యాల జిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఏర్పడిన జిల్లా పరిషత్ (జడ్పీ) చైర్మన్ పీఠం బనగానపల్లెను వరించింది నంద్యాల జిల్లాలోని 28 మండలాలకు ప్రాతినిధ్యం వహించే ఈ కీలక పదవి ఎవరికి దక్కుతుందా అని జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెరదించారు

గురువారం అర్ధరాత్రి విడుదల చేసిన చైర్మన్ అభ్యర్థుల జాబితాలో బనగానపల్లె జడ్పీటీసీ సభ్యుడు, బనగానపల్లె మాజీ సర్పంచ్ బురానుద్దీన్ పేరును అధికారికంగా ప్రకటించారు.

మైనార్టీలకు పెద్దపీట.. మంత్రి బీసీ వ్యూహం:

నంద్యాల జడ్పీ పీఠాన్ని అధిష్టించేందుకు జిల్లాలోని పలువురు ముఖ్య నేతలు తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే, అనూహ్యంగా బనగానపల్లె జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బురానుద్దీన్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. నూతన జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి జడ్పీ చైర్మన్ పదవిని మైనార్టీ వర్గానికి కేటాయించడం ద్వారా టీడీపీ తన సామాజిక న్యాయాన్ని చాటుకుంది. బురా నుద్దీన్ ఈ ప్రతిష్టాత్మక అవకాశం దక్కడంలో బనగానపల్లె ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డికీలక పాత్ర పోషించారు

అధిష్టానం వద్ద మంత్రికి ఉన్న బలమైన పట్టు, ఆయన రాజకీయ వ్యూహాల వల్లే ఈ పదవి బనగానపల్లెకు దక్కిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నేడే ప్రమాణ స్వీకారం:

మంత్రి బీసీ జనార్ధనరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, సౌమ్యుడిగా బుర్హానుద్దీన్‌కు జిల్లాలో మంచి పేరుంది. శుక్రవారం నంద్యాల జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం, అందరినీ కలుపుకుపోయే తత్వం కలిగిన బుర్హానుద్దీన్.. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి మరింత వన్నె తెస్తారని, జిల్లా అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తారని స్థానిక నాయకులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle