Nandyal: నంద్యాలలో అంతర్‌జిల్లా దొంగల అరెస్ట్ రూ.10 లక్షల బంగారం స్వాధీనం
Nandyal: నంద్యాల పట్టణంలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్‌జిల్లా దొంగల అరెస్ట్. రూ.10 లక్షల విలువైన 51 తులాల బంగారం, వెండి, నగదు స్వాధీనం: ఏఎస్పీ సుస్మిత.
Nandyal: నంద్యాలలో అంతర్‌జిల్లా దొంగల అరెస్ట్ రూ.10 లక్షల బంగారం స్వాధీనం
నంద్యాల: నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జయంపు మహేష్, అభిసెట్టి నాగేంద్ర అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.54 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ సుస్మిత వెల్లడించారు.
ప్రధాన నిందితుడు మహేష్‌పై కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోరీ కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసు అధికారులను, సిబ్బందిని ఆమె అభినందించారు. నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జయంపు మహేష్, అభిసెట్టి నాగేంద్రలు కలిసి జంటగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఏఎస్పీ సుస్మిత వెల్లడించారు.
వీరి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 51 తులాల బంగారు ఆభరణాలు, 11 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.54 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు..
కర్నూలుకు చెందిన ప్రధాన నిందితుడు జయంపు మహేష్ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డాడని, అతనిపై మొత్తం 34 కేసులు ఉన్నట్లు ఏఎస్పీ వివరించారు. గతంలో పలు కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి, తిరిగి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ చోరీలకు పాల్పడటం అతనికి అలవాటుగా మారిందన్నారు. మరో నిందితుడు నాగేంద్రపై ఒక కేసు ఉన్నట్లు తెలిపారు.
ఈ కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐలు ఈశ్వరయ్య, సురేష్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఏఎస్పీ సుస్మిత అభినందించారు.




