Nandyal: జలదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి!
Nandyal: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో లారీ ఢీకొని రాచర్ల సిమెంట్ ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డ్ మనోజ్ మృతి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.
Nandyal: జలదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి!
Nandyal: ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరుణాచల కీ సంబంధించిన లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో మనోజ్ (21), తండ్రి రామ మద్దిలేటి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మనోజ్ రాచర్ల సిమెంట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.
విధులకు వెళ్లేందుకు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్‌పై విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
Next Story




