Nandyal: డోన్, బేతంచెర్ల తహసీల్దార్ కార్యాలయాల్లో జేసీ ఆకస్మిక తనిఖీ!
Nandyal: డోన్, బేతంచెర్ల తహసీల్దార్ కార్యాలయాల్లో నంద్యాల జేసీ సూరజ్ ధనంజయ్ గనోర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రీ-సర్వే పనులు, ఫ్రీహోల్డ్ భూ సమస్యలపై సమీక్షించారు.
Nandyal: డోన్, బేతంచెర్ల తహసీల్దార్ కార్యాలయాల్లో జేసీ ఆకస్మిక తనిఖీ!
నంద్యాల: నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ ధనుంజయ సూరజ్ డోన్, బేతంచెర్ల తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డోన్ కార్యాలయంలోని రికార్డు రూమ్‌ను పరిశీలించి, రీ-సర్వే పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.
అనంతరం బేతంచెర్ల తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, కార్యాలయ నిర్వహణపై పరిశీలన చేశారు. డోన్ మండలం మల్కాపురం గ్రామంలో రైల్వే ఎంక్రోచ్‌మెంట్‌కు సంబంధించిన సమస్యలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్, రైతుల సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




