Nandyal: కొత్తపల్లి కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని భవ్య ఆత్మహత్య!

Nandyal: నంద్యాల జిల్లా కొత్తపల్లి కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని భవ్య ఆత్మహత్య. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందంటూ విద్యార్థినిలు, బంధువుల ఆందోళన.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 23 Sept 2026 1:29 PM IST
Nandyal
X

Nandyal: కొత్తపల్లి కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని భవ్య ఆత్మహత్య!

Nandyal: నల్లమల అడవి ప్రాంత గ్రామాల్లో విద్యార్థినిలు మరింత విద్యావంతులు కావాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమ పిల్లలు మంచి విద్యా బుద్ధులతో మంచి ప్రయోజకులవుతారని ఆశించిన తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి తమ పిల్లలను ఇలాంటి పాఠశాలల్లో చేరుస్తుంటే.. పాఠశాల నిర్వాహకుల నిర్వాకం.. నిర్లక్ష్యానికి విద్యార్థినిల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ఇందుకు నిదర్శనం ఓ 16 సంవత్సరాల విద్యార్థిని ఆత్మహత్యనే

నంద్యాల జిల్లా రెవిన్యూ డివిజన్ కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ పాఠశాలలో 16 సంవత్సరాల భవ్య ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. విద్యార్థినిధి కుత వేట దూరంలో ఉన్న యం. లింగాపురం స్వగ్రామం.

కేజీబీవీ పాఠశాల హాస్టల్ లో ఉంటూ చదువుకుంటుంది. ఏమైందో ఏమో కానీ రాత్రి భోజనాలు అయిన తర్వాత విద్యార్థిని భవ్య బాత్రూం కి వెళ్ళింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో సహ విద్యార్థులు వెళ్లి చూశారు.

అప్పటికే స్పృహ తప్పి బాత్రూంలో పడిపోయిన దివ్యను పరిశీలించిన విద్యార్థినులు ఆ విద్యార్థిని నోటిలో ఫినాయిల్ ఉండటం, ఆ పక్కనే ఫినాయిల్ బాటిల్ ఉండడం గమనించారు.

ఈ విషయాన్ని హాస్టల్ యాజమాన్యానికి తెలిపినా.. తోటి విద్యార్థులను మందలించి అక్కడ నుంచి కిం పంపివేశారు.

బాత్రూంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి భవ్య వద్ద ఉన్న ఆత్మహత్య ఉత్తరాన్ని హాస్టల్స్ సిబ్బంది అదృశ్యం చేశారు.

విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనను ఆ రాత్రి కొన్ని గంటల పాటు గోప్యంగా ఉంచిన హాస్టల్ యాజమాన్యం పరిస్థితి విషమించడంతో కొత్తపల్లి ప్రాథమిక ఆసుపత్రికి, అక్కడ నుంచి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలాగే విద్యార్థిని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

సంఘటనను విద్యార్థినిలు చూసి హాస్టల్ యాజమాన్యం దృష్టికి తెచ్చిన వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే .. విద్యార్థిని ప్రాణాలు పోయేవి కాదని సహ విద్యార్థులు ఆరోదించారు.

ఇదిలా ఉంటే.. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని యం. భవ్య ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని భవ్య రాసిన సొసైటీ నోట్ ను మొదట దాచి ఉంచిన హాస్టల్ యాజమాన్యం ఆ తర్వాత పోలీసుల జోక్యంతో వారి చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

పోలీసులు పలకోనాల్లో విచారణ ప్రారంభించారు

గతంలో ఇదే కస్తూరిబా గాంధీ పాఠశాల హాస్టల్లో ప్రిన్సిపల్, సిబ్బంది విద్యార్థినిలకు సరైన భోజనం అందించక, పురుగుల పడ్డ ఆహారాన్ని వడ్డించిన సంఘటనను ప్రశ్నించిన విద్యార్థినులను చితకబాది వేధించారు. అప్పట్లో జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించింది. అయితే ఓ జిల్లా స్థాయి అధికారి విచారణకు వచ్చి ఇదంతా అవాస్తవమని హాస్టల్ సిబ్బందిని శాఖా పరమైన చర్యల నుంచి తప్పించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

గత కొంతకాలంగా కొత్తపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో హాస్టల్ నిర్వాహకుల అక్రమాలు, అవినీతి, వేధింపులు మితిమీరుతున్నా కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విద్యార్థినిల తల్లిదండ్రులు జిల్లా అధికారులను ప్రశ్నిస్తున్నారు.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)