Koilakuntla: ఆన్‌లైన్ బైక్ కొనుగోలు వివాదాన్ని పరిష్కరించిన పోలీసులు
Koilakuntla:ఆన్‌లైన్ బైక్ కొనుగోలు వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ యువకుడికి నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పోలీసులు న్యాయం చేశారు. స్పందించిన ఎస్ఐ, సీఐలపై బాధితుడు ప్రశంసలు.
Koilakuntla: ఆన్‌లైన్ బైక్ కొనుగోలు వివాదాన్ని పరిష్కరించిన పోలీసులు
కోవెలకుంట్ల: ఆన్‌లైన్‌లో మోటార్‌సైకిల్ కొనుగోలు వ్యవహారంలో బాధితుడికి న్యాయం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లా, చీకియ చందోలి గ్రామానికి చెందిన సత్యం పాండే (24) ఆన్‌లైన్‌లో TVS Rider మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసేందుకు నంద్యాల జిల్లా సంజామల మండలం ఆల్వకొండ గ్రామానికి చెందిన గిరి హుస్సేన్ తో ఫోన్ ద్వారా సంప్రదించాడు
మోటార్‌సైకిల్ ధరను రూ.40,000/-గా నిర్ణయించుకుని, సత్యం పాండే ఇప్పటికే రూ.30,000/-ను ఫోన్ పే ద్వారా చెల్లించాడు. మిగిలిన రూ.10,000 వేలు చెల్లిస్తే వాహనాన్ని ట్రాన్స్‌పోర్ట్ ద్వారా పంపాలని కోరగా, హుస్సేన్ మరో రూ.20,000/- చెల్లించాలని చెప్పడంతో సత్యం పాండే నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఫోన్ ద్వారా సంప్రదించాడు.
వెంటనే స్పందించిన పోలీసులు ఈ విషయాన్ని సంజామల ఎస్‌ఐ రమణయ్య, కోయిలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ దృష్టికి తీసుకెళ్లారు.
కోవెలకుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతు నాయక్, పోలీసులు హుస్సేన్‌ను పిలిపించి ఇరువర్గాల సమస్యను పరిష్కరించారు. ముందుగా అంగీకరించిన ప్రకారం సత్యం పాండే మిగిలిన రూ.10,000 వేలు చెల్లించగా, హుస్సేన్ మోటార్‌సైకిల్‌ను అతనికి అప్పగించాడు.
సత్యం పాండేకు తెలుగు తెలియకపోవడం, హుస్సేన్‌కు హిందీ అర్థం కాకపోవడం వల్ల ఏర్పడిన భాషా సమస్యను కూడా పోలీసులు పరిష్కరించి ఇరువురికి న్యాయం చేశారు. పోలీసులు సత్వరమే స్పందించి తన సమస్యను పరిష్కరించినందుకు సత్యం పాండే నంద్యాల జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేసి, పోలీసుల స్పందనపై సంతోషం వ్యక్తం చేశాడు.




