Nandyal: శ్రీశైలంలో వైభవంగా కోటి దీపోత్సవం.. పాల్గొన్న భక్తులు

Nandyal: నంద్యాల జిల్లా శ్రీశైలంలో వైభవంగా కోటి దీపోత్సవం; కైలాసం సెట్టింగ్, మనో బృందం సంగీత విభావరి, చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో దంపతుల హాజరు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 20 Nov 2026 11:46 PM IST
Nandyal
X

Nandyal: శ్రీశైలంలో వైభవంగా కోటి దీపోత్సవం.. పాల్గొన్న భక్తులు

నంద్యాల జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దేవస్థానం ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు దేవస్థానం ఆగమ పాఠశాల ఎదురుగల మైదానంలో భారీ కైలాసం సెట్టింగ్ ఏర్పాటు చేశారు కార్యక్రమంలో కైలాసం సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కైలాసం వేదికపై శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు,వేదపండితులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు పూజలనంతరం దశవిధ హారతులను సమర్పించారు.

కోటి దీపోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించారు భక్తులకు ప్రమిదలు,పూజా సామాగ్రిని ఉచితంగా దేవస్థాన అధికారులు ఏర్పాటు చేయగా భక్తులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు అధ్యంతం ఆధ్యాత్మిక భావనతో సాగిన కార్యక్రమం భక్తులను మంత్రముద్రం చేసింది మరోపక్క భక్తులలో భక్తిభావం పెంచేందుకు ప్రఖ్యాత సినీ నేపధ్య గాయకులు మనో,బృందంచే భక్తి సంగీత స్వరార్చన కార్యక్రమం నిర్వహించారు.

కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ రమేష్ నాయుడు మాట్లాడుతూ వైదిక సాంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాధాన్యం కల్పించబడిందన్నారు దీపజ్యోతిని యజ్ఞానికి సంకేతంగా చెప్పడం మన సాంప్రదాయం అన్నారు అందుకే సాంప్రదాయబద్ధంగా కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు శ్రీ స్వామి అమ్మవార్ల కైంకర్యంగా ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు తెలిపారు.

జ్ఞానం వెలుగు ఉత్సాహం ఆనందం శాంతి మొదలైన వాటికి దీపాన్ని ప్రతీకగా భావిస్తారన్నారు దీపారాధన వలన ఈ దివ్య గుణాలను పొందవచ్చునని పండితులు పేర్కొంటున్నారని అన్నారు శ్రీ స్వామి అమ్మవార్లకు దీపజ్యోతిని సమర్పించడం వలన సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతుందన్నారు వైదిక సంప్రదాయంలో పరమేశ్వరునికి దీపజ్యోతిని సమర్పించడం వలన సకల శుభాలు కలుగుతాయని అన్నారు కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు,స్థానికులు,పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM