Nandyal: నంద్యాల నూనెపల్లెలో రైల్వే అండర్ బ్రిడ్జి కోసం నిరాహార దీక్షలు!

Nandyal: నంద్యాల నూనెపల్లెలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరుతూ స్థానికుల రిలే నిరాహార దీక్షలు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం.

R Pavankalyan, Nandyal
Published on: 28 Sept 2026 1:09 PM IST
Nandyal
X

Nandyal: నంద్యాల నూనెపల్లెలో రైల్వే అండర్ బ్రిడ్జి కోసం నిరాహార దీక్షలు!

Nandyal: నంద్యాల పట్టణంలోని నూనెపల్లె రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు నిరవధిక రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. "వందేమాతరం స్ఫూర్తితో – మన జన్మభూమి వందనం" ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ఉద్యమానికి నూనెపల్లె అభివృద్ధి కమిటీ నాయకత్వం వహిస్తోంది.

నంద్యాల నూనెపల్లెలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ట్రాక్ దాటే సమయంలో విద్యార్థులు, వ్యాపారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.నూనెపల్లె అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టి, ప్రభుత్వం వెంటనే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కొందరు ఉద్యమకారులు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం అండర్ బ్రిడ్జికి ఆమోదం తెలిపిందని, అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పనులు ప్రారంభించడంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు.ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల సమస్య పరిష్కారమే ముఖ్యమని, రాజకీయంగా ఒకరిపై ఒకరు నెట్టుకోవడం కాకుండా వెంటనే అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరారు. ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతోనే నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.నూనెపల్లె రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal