Nandyal: నంద్యాల దోపిడీ నిందితుడు అరెస్ట్.. వారం రోజుల్లోనే కేసు క్లోజ్!

Nandyal: నంద్యాల బైర్మల్ స్ట్రీట్ దోపిడీ కేసును ఛేదించిన వన్ టౌన్ పోలీసులు. నిందితుడు షేక్ షఫీ అరెస్ట్, రూ. 20 వేల నగదు స్వాధీనం.

R Pavankalyan, Nandyal
Published on: 4 May 2026 10:49 AM IST
Nandyal
X

Nandyal: నంద్యాల దోపిడీ నిందితుడు అరెస్ట్.. వారం రోజుల్లోనే కేసు క్లోజ్!

నంద్యాల జిల్లా: నంద్యాల పట్టణంలో సంచలనం సృష్టించిన బైర్మల్ స్ట్రీట్ దోపిడీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. కేవలం వారం రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి, దోచుకున్న నగదు మరియు స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.

గత నెల ఏప్రిల్ 22న ఉదయం సుమారు 11:35 గంటలకు, గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన వ్యక్తి వరి ధాన్యం విక్రయం ద్వారా వచ్చిన రూ.20,000 నగదుతో టీవీ కొనుగోలు కోసం నంద్యాలకు వచ్చారు.RTC బస్టాండ్ నుండి బైర్మల్ స్ట్రీట్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, శిరీష ఆసుపత్రి సమీపంలో ఒక వ్యక్తి స్కూటీతో వెనుక నుంచి ఢీకొట్టి, గాయపరిచి, ప్రాణహాని బెదిరింపులతో నగదును దోచుకున్నాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీలు మరియు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని గుర్తించారు. మే 3 సాయంత్రం 5 గంటల సమయంలో నంద్యాల చెరువు కట్ట వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు..నిందితుడు షేక్ షఫీ (46)గా గుర్తించారు. ఇతనిపై గతంలో నెల్లూరు, కడప మరియు నంద్యాల జిల్లాల్లో పలు దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడి వద్ద నుండీ చేసిన రూ.20,000 నగదు TVS జూపిటర్ స్కూటీ (AP 40 KF 3242) స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోలీసులకు అభినందనలు ఈ కేసును వారం రోజుల్లోనే ఛేదించిన నంద్యాల 1 టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజలకు సూచనలు చేసిన వన్ టౌన్ CI సుధాకర్ రెడ్డి ఇళ్లు, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి..అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story