Nandyal: నంద్యాల పబ్లిక్ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Nandyal: నంద్యాల పబ్లిక్ స్కూల్ హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం. ఎన్ఐటీసీ ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి నిలకడ.

R Pavankalyan, Nandyal
Published on: 2 July 2026 6:09 PM IST
Nandyal
X

Nandyal: నంద్యాల పబ్లిక్ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

నంద్యాల: పట్టణ శివారులోని ది నంద్యాల పబ్లిక్ స్కూల్ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న అభినవ్ జైన్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో టవల్‌తో బెడ్ కాట్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అభినవ్ జైన్ స్వగ్రామం కోయిలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామం. సమాచారం మేరకు, హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విద్యార్థిని ఆ పరిస్థితిలో గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై, అత్యవసరంగా నంద్యాల టౌన్‌లోని NITC ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు.

వైద్యుల సమాచారం ప్రకారం, అభినవ్ జైన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, కేవలం మూడు రోజుల క్రితమే అభినవ్ జైన్ నంద్యాల పబ్లిక్ స్కూల్‌లో చేరినట్లు సమాచారం. అయితే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story