Srisailam: శ్రీశైలంలో ధర్మపథం.. శ్రీవాణి సంస్థ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం!

Srisailam: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా దక్షిణ మాడవీధి వేదిక వద్ద శ్రీవాణి సాంస్కృతిక సంస్థ, రంగారెడ్డి వారిచే భజన నిర్వహించారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 18 Nov 2026 12:21 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో ధర్మపథం.. శ్రీవాణి సంస్థ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం!

శ్రీశైలం: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా నిత్య కళారాధన కార్యక్రమంలో శ్రీవాణి సాంస్కృతిక సంస్థ, రంగారెడ్డి వారిచే భజన కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు మంగళవారం సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఈ కార్యక్రమములో స్వామిరార శివలింగా, శాంభవీ జగదేక మాత, అమ్మా పరమేశ్వరీ, జననీ శివకామినీ, దేవదేవ ధవళాచల, చాలదా జన్మ చాలదా మొదలైన పలు భక్తిగీతాలను, అష్టకాలను లక్ష్మీనారాయణ, గోపాల్ రెడ్డి, భీమయ్య, కార్తీక్ కుమార్, సురేష్, మల్లేష్, నవీన్, సురేందర్, ఆనంద్, శ్రీశైలం, రమ్య, పద్మ, సుమతి, లావణ్య తదితరులు ఆలాపించనున్నారు. కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM