Nandyal: నంద్యాల ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సుస్మిత

Nandyal: నంద్యాల నూతన ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుస్మిత. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామని, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె స్పష్టం చేశారు.

R Pavankalyan, Nandyal
Published on: 14 July 2026 8:20 PM IST
Nandyal
X

Nandyal: నంద్యాల ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సుస్మిత

నంద్యాల జిల్లా: నంద్యాల అదనపు పోలీసు సూపరింటెండెంట్‌ (ఏఎస్పీ)గా సుస్మిత అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మహానంది దేవస్థానం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి ఆమెను సత్కరించారు. అనంతరం నంద్యాల సబ్‌డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

నంద్యాల ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సుస్మితకు పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. మహానంది దేవస్థానం వేద పండితుల ఆశీర్వాదాల మధ్య ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నంద్యాల సబ్‌డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ సుస్మిత మాట్లాడుతూ... జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మహిళల భద్రతతో పాటు ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజలకు భద్రత కల్పించే విషయంలో ఎలాంటి రాజీ ఉండదని హెచ్చరించారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పనిచేస్తామని ఏఎస్పీ సుస్మిత తెలిపారు...

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story