Nandyal: విధులు వదిలి ప్రతిపక్ష పార్టీ ర్యాలీలో VRO సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Nandyal: నందికొట్కూరు మల్యాల VRO మనోహర్ విధులు నిర్వహించాల్సిన సమయంలో YSRCP ర్యాలీలో పాల్గొనడంపై కలకలం రేగింది, కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో స్పష్టం చేశారు.
Nandyal: విధులు వదిలి ప్రతిపక్ష పార్టీ ర్యాలీలో VRO సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Nandyal: నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనలు గుర్తులేనట్టున్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన VRO ఏకంగా డ్యూటీ సమయంలోనే ప్రతిపక్ష పార్టీ ర్యాలీలో తలమునకలైపోయాడు.
DSC అవకతవకలపై వైఎస్ఆర్సీపీ సోమవారం నిర్వహించిన ర్యాలీలో నందికొట్కూరు మండలం మల్యాల గ్రామానికి చెందిన ఓ VRO (మనోహర్) పాల్గొన్న ఫోటో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. ఆ సమయంలో ఆయన రెవెన్యూ విధులు నిర్వర్తించాల్సి ఉండగా, రాజకీయ రంగు పులుముకున్నాడని స్థానికులు మండిపడుతున్నారు.
"ప్రజల పనులు చేయకుండా పార్టీలకు వత్తాసు పలుకుతున్నారా?" అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ సభల్లో కానీ,కార్యక్రమాల్లో పాల్గొనడం సర్వీస్ రూల్స్ ప్రకారం తప్పు.
ఈ విషయంపై ఆత్మకూరు ఆర్డీవో సి.వెంకట శివను చరవాణిలో వివరణ కోరగా విచారించి,ఎవరిని ఉపేక్షించేది లేదని అట్టి వారి పై తగు చర్యలు తీసుకుంటామని తెలుపడం జరిగింది.ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ VRO పై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




