Nandyal: బండి ఆత్మకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం భార్య మృతి!
Nandyal: నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురం సమీపంలో ఆటో బోల్తా పడి వివాహిత మృతి. భర్త, అత్తకు గాయాలు. కుక్క అడ్డురావడంతో ప్రమాదం.
Nandyal: బండి ఆత్మకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం భార్య మృతి!
Nandyal: నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకశిలా అభయాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో ఈరోజు ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో ఆటో బోల్తా పడింది.
వెలుగోడు మండలం గుంతకందాల గ్రామానికి చెందిన విజయుడు తన భార్య సోమేశ్వరమ్మ (40), తల్లితో కలిసి ఆటోలో నంద్యాలకు బయలుదేరారు. మార్గమధ్యంలో అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో దానిని తప్పించబోయిన విజయుడు ఆటోపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మెను ఆటో ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న విజయుడి భార్య సోమేశ్వరమ్మ తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. విజయుడితో పాటు అతని తల్లికి కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.




