Sanjamala: సంజామలను కరువు మండలంగా ప్రకటించాలని వైయస్సార్‌సీపీ పోరుబాట

Sanjamala: సంజామలను వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందజేసింది.

Ramanaiah, Banaganepalle
Published on: 9 Oct 2026 5:45 PM IST
Sanjamala
X

Sanjamala: సంజామలను కరువు మండలంగా ప్రకటించాలని వైయస్సార్‌సీపీ పోరుబాట

సంజామల: సంజామల మండలంలో కరువు సెగలు భగ్గుమంటున్నాయి. సంజామలను తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలంటూ వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది.

బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో కోట బురుజు నుంచి సంజామల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడం సూర్య ప్రకాష్ రెడ్డి, ఎర్రబోతుల పాపిరెడ్డి, చల్లా విగ్నేశ్వర రెడ్డి ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు..ఈ నిరసన ప్రదర్శనకు రైతు సంఘాలు, సీపీఐ నేతలు సంపూర్ణ మద్దతు పలికారు. అనంతరం తహసీల్దార్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ... మండలంలో అత్యల్ప వర్షపాతం నమోదైనా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సెలవు దినాల్లో మొక్కుబడిగా అధికారులకు లేఖలు రాయడం కాదని, సంజామలను కరువు మండలంగా ప్రకటించే బాధ్యత స్థానిక మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇస్తున్నామని, అప్పటికీ స్పందించకపోతే రైతాంగంతో కలిసి ఎమ్మార్వో కార్యాలయం ఎదుటే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

కార్యక్రమం లో ఎర్రబోతుల పాపిరెడ్డి, గుండం సూర్య ప్రకాష్ రెడ్డి, చల్లా విగ్నేశ్వర రెడ్డి, రైతు సంఘం నాయకులు సిపిఐ నేతలు పాల్గొన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle