Nandyala: కన్నబిడ్డలకు విషమిచ్చిన కిరాతక తండ్రి
Nandyala: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం చిన్నరాజుపాలెంలో కుటుంబ కలహాలు చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చాయి.
Nandyala: కన్నబిడ్డలకు విషమిచ్చిన కిరాతక తండ్రి
Nandyala: కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, తన కోపంతో వారి పాలిట కాలయముడయ్యాడు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలకు నిష్కపటమైన చిన్నారులను బలిచేయాలని చూశాడు. ఈ దారుణ ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం చిన్నరాజుపాలెం గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన మెటా నాయక్ మరియు అతని భార్య మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం భార్య ఇంట్లో లేని సమయాన్ని చూసుకున్న మెటా నాయక్, తన ఇద్దరు పిల్లలు జయత్ నాయక్ (6), మైథిలి భాయ్ (4) కు కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చాడు. అయితే, ఆ కూల్ డ్రింక్‌లో ముందే పురుగుల మందు కలిపి బిడ్డలతో బలవంతంగా తాగించాడు.
విషం తాగిన కొద్దిసేపటికే చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో గమనించిన స్థానికులు, బంధువులు వెంటనే వారిని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆ చిన్నారులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.




