nandyala: బావిలో పడ్డ 30 గేదెలు.. ఎనిమిది మృతి, రైతుల కన్నీరు!

nandyala: నంద్యాల జిల్లా పాములపాడు మండలం కృష్ణారావుపేటలో విషాదం. ఈదురు గాలులకు బెదిరి వ్యవసాయ బావిలో పడి 8 పాడి గేదెలు మృతి.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 15 May 2026 9:19 PM IST
nandyala
X

nandyala: బావిలో పడ్డ 30 గేదెలు.. ఎనిమిది మృతి, రైతుల కన్నీరు!

Nandyala: మండు వేసవిలో మేత దొరకడమే కష్టమైంది. కనీసం దాహార్తి తీర్చుకునేందుకు కూడా పశువులకు నీరు లేక పొలాల వెంట తిరుగుతూ చివరికి ఓ వ్యవసాయ బావిలో పడి పాడి గేదలు మృత్యుపాలైన విషాద సంఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పాములపాడు మండలం కృష్ణారావు పేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామంలో రైతులు వ్యవసాయంతో పాటు అడిగేదెల పెంపకంతో జీవనం సాగిస్తున్నారు.

వ్యవసాయ సీజన్ కు సిద్ధపడుతున్న క్రమంలో ఉదయం మేతకు వెళ్లిన పాడి గేదెలు సాయంత్రం ఇంటి ముఖం పట్టే క్రమంలో పెను గాలులు వీచాయి. గ్రామ సమీపానికి వస్తున్న క్రమంలో పాడి గేదెల మంద ఒక్కసారిగా పరుగులు పెట్టింది. దీంతో గుబురు పొదల మధ్య ఉన్న నేల పాటు వ్యవసాయ బావిలో ఒకసారి గా ఒక్కదాని వెంట ఒకటి గేదెలు పడిపోయాయి. ఈ విషయం రైతులకు తెలిసేలోగా చీకటి పడింది. అయినా ఎంతో కష్టపడి మృతి చెందిన ఎనిమిది పాడి గేదెలను రైతులు బయటకు తీశారు. మొత్తం గేదెలు 30కి పైగా ఉండవచ్చని రైతులు పేర్కొంటున్నారు.

ఈ విషాద సంఘటన మండలంలోని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులకు తెలిసినా ఏ ఒక్కరు ప్రమాద సంఘటన స్థలానికి రాలేదు. జాతీయ రహదారి 340 c పక్కనే కృష్ణారావు పేట గ్రామ స్మశాన వాటిక సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పాములపాడు పోలీసులు బావిలో పడ్డ అడిగేదెలను జెసిబి యంత్రాలతో వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఒక్కో పాడి గేద విలువ సుమారు నాలుగైదు లక్షల రూపాయల వరకు ఉండవచ్చని బాధిత రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story