Nandyala: కోవెలకుంట్ల పరిధిలో ఘరానా మోసం.. తాయత్తు పేరుతో దోపిడీ!

Nandyala: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం సౌదరదిన్నె గ్రామంలో మాయమాటలతో మహిళను బురిడీ కొట్టించి రూ. 50,000 దోచుకెళ్లాడు ఒక మాయల పకీరు.

Ramanaiah, Banaganepalle
Published on: 25 Jun 2026 12:13 PM IST
Nandyala
X

Nandyala: కోవెలకుంట్ల పరిధిలో ఘరానా మోసం.. తాయత్తు పేరుతో దోపిడీ!

Nandyala: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం సౌదరదిన్నె గ్రామం లో ఓ ఇంటిలో దోపిడీ. మాయమాటలతో మహిళను బురిడీ కొట్టించి 50,000 వేలు దోచుకుని పరారైన మాయల పకీరు.

మాయల ఫకీరు సౌదరదిన్నె గ్రామంలోని ఖాసీంబీ మహిళ ఇంటికి వెళ్లి నీవు బాధలో ఉన్నావు నీ భర్త ఆరోగ్యం సరిగా లేదు నీకు తాయత్తు కట్టాలని నమ్మబలికి అంగడికి వెళ్లి టెంకాయ తీసుకు రమ్మని చెప్పాడు.

ఖాసీంబీ అంగడికి వెళ్లి టెంకాయ తీసుకొని వచ్చే లోపే మాయల పకీరు బీరువాలో ఉన్న 50వేల రూపాయలు డబ్బులు తీసుకుని హుడాయించాడు. ఖాసీంబీ బయటికి వెళ్లి చూడగా మాయల ఫకీరు కనిపించలేదు, పొలం పనికి వె వెళ్లిన భర్త దస్తగిరి కి జరిగిన విషయం చెప్పిన భార్య ఖాసీంబీ.

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story