Nandyala: నంద్యాలలో భూ కబ్జాల పర్వం ఫరూక్ నగర్‌లో బాధితుల ఆందోళన
Nandyala: నంద్యాల ఫరూక్ నగర్‌లో భూ వివాదం ముదిరింది. 1915 నాటి రికార్డులు ఉన్నా.. అధికార పార్టీ నేతల పేర్లు చెప్పి కబ్జాలకు యత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
Nandyala: నంద్యాలలో భూ కబ్జాల పర్వం ఫరూక్ నగర్‌లో బాధితుల ఆందోళన
నంద్యాల జిల్లా: నంద్యాలలో వరుసగా జరుగుతున్న భూ వివాదాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.లక్షలు పెట్టి స్థలాలు కొనుగోలు చేసిన లబ్ధిదారులు ఇప్పుడు ఆందోళనలో మునిగిపోయారు.అక్రమార్కుల బెదిరింపులతో భయాందోళనలకు గురవుతున్నారు.ఈ ఘటనలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నివేదికలో.
నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ ప్రాంతంలో భూ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన స్థలాలను అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
మొదట అక్రమార్కుల నుండి ఒత్తిడి ఎదుర్కొన్న స్థల యజమానులు,ఇప్పుడు అదే స్థలం వక్ఫ్ బోర్డ్‌కు చెందినదని బోర్డులు పెట్టడానికి యత్నించడం మరింత కలకలం రేపింది...దీనిని అడ్డుకున్న స్థల యజమానులపై దాడికి యత్నించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
“1915, 1927, 1934, 1935 సంవత్సరాల డాక్యుమెంట్ల ప్రకారం..సర్వే నెంబర్ 1900/1లో 1.13 సెంట్లు మా సొంతమని స్పష్టంగా ఉంది.అయినా కూడా అధికార పార్టీ పేర్లు చెప్పి మాకు బెదిరింపులు చేస్తున్నారు” అని బాధితులు వాపోతున్నారు.
ఖాళీ స్థలం కనబడితే అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి కబ్జా చేసేందుకు వెనుకాడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇటీవలే అధికార పార్టీ యువనేతలు ప్రెస్ మీట్ నిర్వహించి తమ పేర్లు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అయితే అదే అధికార పార్టీ నేతల పేర్లు ఉపయోగించి కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితులు అంటున్నారు.ఈ భూ వివాదాల నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు..మరియు అధికార పార్టీ నాయకులు బాధితులకు న్యాయం చేస్తారా..?అన్న ప్రశ్న స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది.


